ఖాతాదారులకు ఉత్తమ సేవలందించాలి

— మెదక్ కలెక్టరేట్లో నూతన ఎస్బిఐ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నూతన ఎస్బిఐ బ్యాంక్ బ్రాంచ్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో నూతనంగా 19వ ఎస్బిఐ నూతన బ్రాంచ్ ను కలెక్టరేట్లో ప్రారంభించామని, ఖాతాదారులకు, కలెక్టరేట్ కార్యాలయ పనులకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.
జిల్లాలో ఇతర బ్యాంకుల వల్లే కలెక్టర్ కార్యాలయ ఎస్బిఐ బ్యాంకులో కూడా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని సాధారణ బ్యాంక్ రుణాలు, బంగారం పై రుణాలు, వ్యక్తిగత రుణాలు లాంటి అన్ని సౌకర్యాలు ఈ బ్రాంచ్ లో కలిగి ఉంటాయని అన్నారు. ఖాతాదారులు, కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన ఎస్బిఐ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని తెలిపారు.
త్వరలో ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్బిఐ రీజినల్ మేనేజర్ అరుణ జ్యోతి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ నరసింహమూర్తి , బ్యాంక్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment