శీర్షిక : మానవ రంగులు

శీర్షిక : *మానవ రంగులు*
********************
*జాగ్రత్త జాగ్రత్త*
కాసుకుని కూర్చున్నాయి రంగులు మార్చే కుక్కలు
రకరకాల గుంటనక్కలు
వార్తా వార్తా చేరవేయడమే వీరి లక్ష్యం
చెవులు చెవులు కోరుక్కోవడమే వీరికి అలవాటు
పరుల గురించి పాఠాలుగా చెప్పుకుంటారు
కడుపునిండకుంటే సొంత ఆలోచనలు కల్పించి
గ్రంథాలనే లిఖించేస్తారు
పచ్చి మాటలతో పచ్చి కబుర్లు చెప్పుకుంటారు
అలవాటులో పొరపాటుగా ఇంటిగుట్టు వీధిన పెట్టుకుంటారు
ఎంతో కష్టపడి, చమటోడ్చి వారి గొయ్యి వారే తవ్వుకుంటారు
హంగులు పొంగులకు పోయి
రకరకాల రంగులు మారుస్తూ
విచ్చలవిడిగా తిరుగుతారు
ఒకరి గురించి మరొకరికి
ఊరంతా చాటింపులు కొడుతూ ఉంటారు
మానవులు కాస్త రాక్షసులుగా మారతారు
నీచ బుద్ధితో సంతోషంగా గడుపుతారు
మొత్తానికి ఏదో ఒక రోజు కుమిలి కుమిలి ఏడుస్తారు
కడుపు బాదుకుంటారు
శోకసంద్రంలో మునిగిపోతారు
ఈ మాంసపు ముద్దలు….
****************
పోలగాని భాను తేజశ్రీ
కృష్ణాజిల్లా

Join WhatsApp

Join Now

Leave a Comment