తిప్పన నరేష్ నాయుడు క్రికెట్ ట్రోఫీ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

 

తిప్పన నరేష్ నాయుడు క్రికెట్ ట్రోఫీ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

మండల కేంద్రంలోని తెలుగు గంగ కాలనీ గ్రౌండ్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. గురువారం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఎస్సార్ శ్రీనివాసులు రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంతో ఆడుకోవాలని ఆయన సూచించారు. గెలిచినా ఓడిన అందరూ కలిసిమెలసి ఉండాలని కోరారు. ఈ క్రికెట్ టోర్నమెంటును తిప్పన సురేష్ నాయుడు తన తమ్ముని నరేష్ జ్ఞాపకార్థం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లింగాలదిన్నె పెంచల్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఏఎస్ఆర్ , పాల్గొన్నారు.క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment