సామాన్య ప్రజల గొంతుక ప్రజా సంగ్రామం

సామాన్య ప్రజల గొంతుక ప్రజా సంగ్రామం

 

ఎడిటర్ ప్రసాద్ సగారపును అభినందించిన మాజీ మంత్రి ఆర్ డిఆర్

 

సామాన్య ప్రజల గొంతుక ప్రజాసేన గ్రామం దినపత్రిక అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాదులోని పార్టీ ఆర్ డిఆర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి, ఎడిటర్ సగరపుతో కలిసి 2025 ప్రజా సంగ్రామం దినపత్రిక క్యాలండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ప్రజా సంగ్రామం వారిదిగా ఉండి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళుతుంది అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సేవలు అందించి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. పత్రికారంగంతో పాటు న్యాయవాదిగా, విద్యార్థి నాయకుడిగా నిత్యం ప్రజాసేవలో ఉంటున్న ప్రజా సంగ్రామం దినపత్రిక ఎడిటర్ ప్రసాద్ సగరపును అభినందించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రతినిధి గుగులోతు వీరన్న నాయక్ ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment