వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం: కందుకూరి యాదగిరి

వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం: కందుకూరి యాదగిరి

ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని ఈనెల ఒకటో తారీకు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో వర్గీకరణ అమలు పరుస్తూ తీసుకున్న నిర్ణయానికి మాదిగ జాతి అంతా సుప్రీంకోర్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ జాతి ముద్దుబిడ్డ మహాజననేత మందకృష్ణ మాదిగ కు సూర్యాపేట మాదిగ జర్నలిస్టులు పాల్వాయి జానయ్య,కందుకూరి యాదగిరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మిర్చి యార్డులో ఏర్పాటుచేసిన మాదిగ జర్నలిస్టుల సమావేశంలో వారు మాట్లాడారు. అణిచివేత నుండి అణగారిన స్థాయిలో నుండి నిసహాయత స్థితిలో నుండి నిమ్న జాతీయులు దళిత జాతీయులు శాసించే స్థాయికి పరిపాలించే స్థాయికి ఎదగాలని కోరుకున్న భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాటలను ఆదర్శంగా తీసుకొని తమ జాతి వర్గీయులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని సంకల్పించి ఎస్సీలలో ఒక వర్గం మాత్రమే అభివృద్ధి చెందుతూ మిగిలిన వర్గాలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితిని గమనించి 1994 లో ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని చేపట్టిన మహా జననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ కు అదే విధంగా వర్గీకరణ చేపట్టాలని కోరుతూ పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాదిగల అభ్యున్నతి అభివృద్ధి కోసం గత 30 సంవత్సరాలుగా మొక్కవోని దీక్షతో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు దీక్షలు చేసిన ఘనత మందకృష్ణ కే దక్కిందని అన్నారు.మందకృష్ణ మరో అభినవ అంబేద్కర్ గా వారు కొనియాడారు. ఏబిసిడి వర్గీకరణ చేయడం ద్వారా ఎస్సీలలో అన్ని జాతుల వారికి సమన్యాయం జరుగుతుందని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రతి ఇంట్లో పెట్టుకున్నట్లుగానే మందకృష్ణ మాదిగ చిత్రపటాన్ని ప్రతి మాదిగ ఇంట్లో ఏర్పాటు చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రూథర్ బిక్షం కందుల నాగరాజు మామిడి శంకర్ నందిపాటి సైదులు గుడి ప్రభాకర్ ఏర్పుల ప్రవీణ్ సూరారపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment