తక్షణమే కస్తూర్బా పాఠశాల ఎస్ ఓ ను సస్పెండ్ చేయాలి.
* 35 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
* హాస్టల్ లో నాసీరకమైన భోజనమే కారణం
* సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు
* ఫుడ్ టెండర్ ను రద్దుచేసి రీటెండర్ నిర్వహించాలి
* ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యం .తారా సింగ్ నాయక్
పెంట్లవెల్లి మండల కేంద్రంలోని ఉన్న కేజీబీవీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో కొల్లాపూర్ ప్రభుత్వ హాస్పిటల్లో విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని కోరిన ఎస్ఎఫ్ఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎం తారా సింగ్ వారి బృందం .అనంతరం వారు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కు సోమవారం పెంట్లవెల్లి కేజీబీవీ హాస్టల్ లో విద్యార్థుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం తారా సింగ్ మాట్లాడుతూ పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఆదివారం ఒకేసారి 35 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కి కారణమైన ఎస్ఓ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులకు పాడైపోయిన, కుల్లి పోయిన, కూరగాయలను వండడం ద్వారా, ఇలాంటి పరిస్థితి ఇక్కడ చోటుచేసుకుందని ఆయన తెలిపారు. పాడైపోయిన కూరగాయలు, వాటిపై ఈగలు దోమలు వాలినటువంటివి, వాటితో వంట వండడం వలన ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ చేయకుండా వేల జీతాలు తీసుకొని నామ మాత్రపు పర్యవేక్షణ చేసి చేతులు దులుపుకుంటున్నారని వారు అన్నారు. వీటికి కారణం హాస్టల్ ఎస్ ఓ నిర్లక్షమేననీ ఆయన మండిపడ్డారు. అలాగే సంబంధిత హాస్టల్ ఎస్ ఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన అధికారులను కోరారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం తగదనీ వారికి నాణ్యమైన భోజనం అందించకుండా నాసీరకమైనా భోజనం పెట్టడం వలనే ఫుడ్ పాయిజన్ కు కారణం అయ్యిందని అన్నారు. ఫుడ్ టెండర్ను కూడా రద్దుచేసి వేరే వ్యక్తికి ఇవ్వాలని వారు అన్నారు. నాసిరకమైన కూరగాయలు నాసిరకమైన చికెన్ గుడ్లు, పండ్లు తక్కువ ధరలకు తెచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న టెండర్ దారులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాఠశాలలో విద్యార్థులు మలవిసర్జనకు బయటికి వెళ్లి వస్తున్నారని వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు కనీసం సౌకర్యాలు లేక లెట్లూమ్స్ బాత్రూమ్స్ లేక విద్యార్థులకు చెట్లపొంటి వెళ్తున్నారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కొల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు సులిగిరి తరుణ్ డివిజన్ నాయకులు మంజు ప్రకాష్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.