గుంతల మయంగా మారిన బీటీ రోడ్లకు మరమ్మత్తులు చేసి మట్టి రోడ్లకు డాంబర్ వేయాలని సిపిఎం గుండాల మండల కార్యదర్శి మద్దెపురం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం మండల కమిటీ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సీతారాంపురం-వెల్మజాల గ్రామాల మధ్య ప్రధాన రోడ్డుపై సిపిఎం పోరు బాటలో భాగంగా జెండాలను ప్రదర్శించి నిరసన తెలిపారు.ఈ సంధర్భంగా మండల కార్యదర్శి మద్దెపురం రాజు మాట్లాడుతూ ఆలేరు- గుండాల మండలాలను కలుపుతూ ఉన్న ప్రధాన రహదారిగా ఉన్న ఈ రోడ్డుతో పాటు గుండాల నుండి నూనెగూడెం మీదుగా సీతారాంపురం,గుండాల నుండి గంగాపురం మీదుగా జనగాం రోడ్డు వరకు గుంతల మయంగా మారడం వల్ల ప్రతినిత్యం బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులతో పాటు ప్రయాణికులు నరకయాతన పడుతున్నారని,ఆయా గ్రామాల ద్విచక్ర వాహనదారులు,రైతులు, వ్యవసాయ కూలీలు,మహిళలు,విద్యార్థులు దారిలో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంట్రాక్టర్లకు కక్కుర్తి,అధికారుల అలసత్వం వల్ల రోడ్లు నిర్మించిన కొద్ది కాలానికే ధ్వంసం అయ్యాయని విమర్శించారు.అదేవిధంగా గుండాల నుండి వస్తాకొండూరు వరకు,బ్రాహ్మణపల్లి నుండి సీతారాంపురం వరకు,గంగాపురం నుండి మరిపడిగ వరకు,రామారం నుండి అంబాల వరకు ఉన్న మట్టి రోడ్లను డాంబరు రోడ్లుగా మార్చి రవాణా సౌకర్యాలను అభివృద్ది చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు పోతరబోయిన సత్యనారాయణ,ఎండి ఖలీల్, సీతారాంపురం గ్రామస్థులు వనం రాజు మలిపెద్ది భీమిరెడ్డి శివరాత్రి నవీన్ మల్లేష్ బక్కయ్య లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
గుంతలమయంగా మారిన బిటి రోడ్లకు మరమ్మత్తులు చేసి లింకు రోడ్లకు డాంబరు వేయాలి
by Ramesh Putta
Published On: July 31, 2024 6:41 pm