పాత విధానాన్ని కొనసాగించాలి…..
మాజీ చైర్మన్ సంచలన ఆరోపణ..
బోర్ల కోసం నాలుగు సంవత్సరాలకు 17 రూపాయలు కూడా ఖర్చు చేయలేం కేవలం నాలుగు నెలలు నెలలో 17 లక్షలు ఖర్చు చూపించారు
ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్న….
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో ఆగస్టు 27 ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని ఇంటి పన్ను వసూలు పాత విధానాన్ని కొనసాగించాలని బిఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాజీ చైర్మన్ బొంది రవీందర్ గారు మాట్లాడుతూ పాత విధానాన్ని కొనసాగించాలని కొత్త తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ప్రజలకు భారం పడకుండా ప్రజాప్రతిని చూడాలని ఏకపక్షం నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బంది కలలో ఉన్నాయని దీనికి వెంటనే రద్దు చేయాలని ప్రజల కోసం కొట్లాటడానికి ఎంతవరకు అయినా వెళ్తామని నాలుగు నెలలు ఉన్నాయి కావున ప్రజల శ్రేయస్సుకోసం పనిచేయాలని కోరారు
తూప్రాన్ పురపాలక పరిధిలో గృహ పన్నులు మరియు వాణిజ్య దుకాణంల పన్నులు ఇష్టా రితినా పెంచినందుకు నిరసనగా ఈ రోజు తూప్రాన్ మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తూప్రాన్ పట్టణ ప్రజలు, రావెళ్లి, పోతారాజ్ పల్లి, అల్లాపూర్, పడాలపల్లి, బ్రాహ్మణపల్లి, వెంకటాపూర్ ప్రజలందరూ పెద్ద ఎత్తున బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో వెళ్లి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందచేశారు.
మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం…..
తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసి ఇంటి పనులు పాత విధానాన్ని కొనసాగించాలని కొత్త విధానాన్ని రద్దు చేయాలని అలాగే యువత కోసం మినీ స్టేడియం నిర్మాణ నిధులు 5.5 కోట్ల రద్దును ఉపసంహరించుకోవాలి ప్రజల ఎంటర్టైన్మెంట్ నిర్మాణం పెద్ద చెరువు కట్ట సందికర్ణ కొరకు 3.15 కోట్లు మొత్తం 16. 65 కోట్లను ఉపాసన ఉపసంహరించుకొని ప్రజల కొరకు ప్రజల శ్రేయస్సు ఏతావితిగా పనులు నిర్మాణం కొనసాగించాలని కోరారు
ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు భైరం ఉమా సత్య లింగం, లావణ్య దుర్గా రెడ్డి, తలారీ పద్మా మల్లేష్, బొంది అరుణ వెంకట్ గౌడ్, నాయకులు సత్తార్ బాయ్, యూత్ లీడర్ శ్రీకాంత్, ఆంజనేయులు, నాగేందర్ రెడ్డి, నర్సింగరావు, కిషన్, ప్రవీణ్ రెడ్డి, లంబ రాజు యాదవ్,మల్లేష్ యాదవ్, అంజయ్య,యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు