వరదల వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

వరదల వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

కేంద్రం తక్షణమే 10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

కేంద్ర ప్రభుత్వం వరదల వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణం సాయంగా 10, వేల కోట్లను ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించి ఏవో సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనివిని ఎరుగని రీతిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వరదలు వలన పంట పొలాలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేల రూపాయలు, ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు 50 వేల రూపాయలు, నష్ట పరిహారం అందించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులు ఎకరానికి 25 వేల రూపాయలు చొప్పున, ఇసుక మెటల్ పెట్టిన పొలాల రైతులకు అదనంగా 10 వేల రూపాయలు, ముంపునకు గురైన ఇండ్లు సామాన్లు తడిసిన కుటుంబాలకు 20వేల రూపాయల తక్షణ సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కట్టించి వరదలకు దెబ్బతిన్న కాలువలు చెరువులు రోడ్లు, గుండ్లు పడిన వాటినే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదలు వచ్చి 20 రోజులు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్లవుల రాములు, అనంతుల మల్లేశ్వరి, జిల్లా కార్యవర్గ సభ్యులు, మేకల శ్రీనివాస్, ఎల్లంల యాదగిరి, ధూళిపాల ధనంజయ నాయుడు, కంబాల శీను, బద్దం కృష్ణారెడ్డి మండవ వెంకటేశ్వర్లు, ఎస్కే లత్తు, దేవర మల్లేశ్వరి, బూర వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు ,జిల్లా కౌన్సిల్ సభ్యులు రేమిడాల రాజు, ఏ ఐ టి యు సి నాయకులు జడ శ్రీనివాస్, దంతాల రాంబాబు, ఖమ్మంపాటి రాము, తొట్ల ప్రభాకర్ రేగట్టి లింగయ్య, ప్రభాకర్, ఎండి పాషా, మహిళా నాయకురాలు లక్ష్మీ, కోటమ్మ , జానయ్య , ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment