మొదటి ప్రమాద హెచ్చరిక, ఎస్పీ కీలక సూచన
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కొత్తగూడెం:సెల్ఫీల కోసం వాగులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.వర్షాల కారణంగా రోడ్లు బురద మయంగా మారి వాహనాల టైర్లు జారే ప్రమాదం ఉందన్నారు.వాహనదారులు రోడ్లపై నెమ్మదిగా వెళ్లేందుకు ప్రయత్నించాలన్నారు. గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక పడిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందని, అత్యవసరమైతే 100కు డయల్ చేయాలన్నారు.