మున్నేరు వాగు మళ్ళీ పొంగి పొర్లే అవకాశం ఉండడంతో ఖమ్మం జిల్లాకు హుటాహుటిన బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి.

మున్నేరు వాగు మళ్ళీ పొంగి పొర్లే అవకాశం ఉండడంతో ఖమ్మం జిల్లాకు హుటాహుటిన బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి.

ఖమ్మం (చార్మినార్ ఎక్స్ ప్రెస్)

మరోసారి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు హుటాహుటిన ఖమ్మం జిల్లాకు బయలుదేరారు. 

 ఇప్పటికే జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు వాగుకి మరోసారి వరద ప్రమాదం పొంచి ఉంది. 

ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం అప్రమత్తం చేయాలని ఉపముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

మున్నేరు వాగుకి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఉపముఖ్యమంత్రి సూచించారు. 

వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 

భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారుల అందరికీ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment