మాజీ మంత్రి పై జరిగిన దాడి హేయమైన చర్య.

మాజీ మంత్రి పై జరిగిన దాడి హేయమైన చర్య.

వరద బాధితుల సహాయం కోసం వస్తే బురద రాజకీయాలు చేస్తున్న అధికార పార్టీ.

ఖమ్మం మున్నేరు వరదల సందర్భంగా నష్టపోయిన ప్రజలను సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడానికి నిత్యవసర వస్తువులు అందించడానికి జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి విచ్చేసిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.పువ్వాడ అజయ్ కుమార్.సబితా ఇంద్రారెడ్డి. జగదీశ్ రెడ్డి కారుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేయడానికి బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు ఆకోజు సునీల్ కుమార్ తీవ్రంగా ఖండించారు.ప్రజా పాలన అని చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయని వరదలు సర్వం కోల్పోయిన బాధితుల పరామర్శించడానికి వస్తే బిఆర్ఎస్ అగ్ర నాయకులపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం చూస్తుంటే వరదను అడ్డం పెట్టుకొని బురద రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా ఆరోపించారు.మాజీ మంత్రి పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంలో ఖండించాలని దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment