సూర్యాపేట ఆశీర్వద సువార్త స్వస్థత సభలు రద్దు చేయడం జరిగిందనీ తెలియగానే వచ్చి నన్ను బలపరచిన దైవజనులందరికి కృతజ్ఞతలు
బిషప్ దుర్గం ప్రభాకర్
బేతెస్థ మినిస్ట్రీస్ & సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
జనవరి 11 శనివారం : ఈ రోజు శాంతినగర్, సూర్యాపేట,బేతెస్థ మినిస్ట్రీస్ మరియు జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ను తన నివాసంలో సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్, సూర్యాపేట పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. ఇంజమూరి గాబ్రియేల్, గౌరవ సలహాదారులు, చార్లెట్ హోం వ్యవస్థాపకులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు ల ఆధ్వర్యంలో పలువురు పాస్టర్స్ జిల్లా వ్యాప్తంగా వచ్చి బిషప్ దుర్గం ప్రభాకర్ ను పరామర్శించి ప్రార్ధించడం జరిగింది. ఈ సందర్బంగా నియోజకవర్గ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ నేల జనవరి తేది 12,13,14 ఆది, సోమ, మంగళవారం లలో మూడు రోజులు సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హ్యారీ గోమ్స్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో జరిగే *ఆశీర్వద, సువార్త, స్వస్థత సభలకు* పోలీస్ వారు సంక్రాతి పండుగ ను చూపుతూ ఒక్కరోజు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం చాలా బాధాకరం అనీ అన్నారు,ఇలాంటి సంఘటనలు గత 40-50 సంవత్సరాలలో ఎప్పుడు జరుగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఫోన్ చేసి దైర్యం చెప్పిన బిషప్స్, పాస్టర్స్,మరియు క్రైస్తవులందరు ప్రత్యక్షముగా, పరోక్షంగా ఫోన్ ద్వారా దైర్యం చెప్పిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ,దేవుని చిత్తం అయితే మళ్ళీ గొప్పగా దేవున్ని మహిమ పరచటానికి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుందాం అనీ ప్రార్ధన చేయవలసినదిగా రిక్వెస్ట్ చేశారు. ఈ కార్యక్రమం లో చివ్వేంల మండల అధ్యక్షులు రెవ గుగులోతు బాలాజీ నాయక్, సూర్యాపేట రూరల్ అధ్యక్షులు పాస్టర్ యల్క ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ ఏర్పుల క్రిస్టోఫర్, పెన్ పహాడ్ అధ్యక్షులు రెవ. డా. డి. జాన్ ప్రకాష్, పాస్టర్ ఉటుకూరి రాజు,రెవ. డా. పంది మార్క్,పాస్టర్ ధరవాత్ నాగు శాంసంగ్ నాయక్,పాస్టర్ అపోలో, కేతేపల్లి మండలం అధ్యక్షులు రెవ. బల్లెం జీవ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు