టీజీ ఎన్పిడీసీఎల్ చైర్ పర్సన్ కు వినతి పత్రం అందజేత
రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని పలువాడల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని గురువారం టీజీ ఎన్పిడీసీఎల్ చైర్ పర్సన్ ఎన్వీ వేణుగోపాల చారికి కాంగ్రెస్ నేత దాసరి శివ వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలోని వీధుల్లో మధ్య స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటుగా అదనపు ట్రాన్స్ ఫార్మర్లు బిగించి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు.