తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలి

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలి

ఈ నెల 2న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలు సహకరిస్తే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంగా మార్చుతాననడం సమంజసం కాదని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కన్వీనర్ బచ్చు పురుషోత్తం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని,వారి పేరును తొలగించడం ఆయనని అవమానించడమే అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి జ్ఞాపకార్థం ఏదైనా ఒక ప్రాజెక్టుకు వారి పేరు పెట్టి సముచిత రీతిలో గౌరవించుకుందామన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని భావితరాలకు తెలియజేసే విధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి వారి పేరే ఉంచాలని శ్రీ వాసవి సేవా సమితి జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్యవైశ్య నాయకులు పొట్టి శ్రీరాములు పేరు మార్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఒప్పించాలన్నారు. విపక్షాలు సైతం పొట్టి శ్రీరాములు పేరు మార్పుకు సహకరించొద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఒప్పించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చకుండా చొరవ తీసుకోవాలన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment