బ్రైట్ గ్లోబల్ పాఠశాలలో ఘనంగా క్రీడా దినోత్సవం & తెలుగు భాషా దినోత్సవం
నిర్మల్ లోని బ్రైట్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ రోజు క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఆటల ప్రాధాన్యత, వాటి ఉపయోగాల గురించి వివరించారు. ఈ వేడుకలో, పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ మురాద్ తోపాటు ఉపాధ్యాయురాలు సింధుజ లను పాఠశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం పిల్లల్లో ఆటలపై ఆసక్తిని పెంపొందించడమే కాకుండా, తెలుగు భాషా వైభవాన్ని గుర్తు చేసింది.