*తెలంగాణ యూత్ కాంగ్రెస్ కంటెస్టింగ్ పటాన్ చెరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బరిలో దండ్ల కిరణ్ కుమార్.
తొలిసారిగా ఆన్ లైన్ లో ఓటింగ్ ప్రక్రియ
-‘హస్తం’ పార్టీకి క్షేత్రస్థాయిలో వెన్నుదన్నుగా యువజన కాంగ్రెస్
-పటాన్ చెరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీలో దండ్ల కిరణ్ కుమార్
-తమ అమూల్యమైన ఓటు ఆన్ లైన్ పద్ధతి ద్వారా వేసి గెలిపించాలని అభ్యర్థన
-కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నా గెలుపుకు సహకరించండి
తెలంగాణ యూత్ కాంగ్రెస్ పటాన్ చెరు అసెంబ్లీ కంటెస్టింగ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దండ్ల కిరణ్ కుమార్
పటాన్ చెరు/అమీన్ పూర్
తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల సందడి నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.ఆన్ లైన్ ఓటింగ్ కావడంతో కార్యకర్తల మద్దతు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించనున్నారు.ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
*బరిలో దండ్ల కిరణ్ కుమార్*
“హస్తం”పార్టీకి క్షేత్రస్థాయిలో వెన్నుదన్నుగా యువజన కాంగ్రెస్ నిలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటివరకు ఆ విభాగం ఎన్నికలకు బ్యాలెట్ విధానంలో నిర్వహించగా.. తొలిసారి ఆన్ లైన్ ద్వారా చేపడుతున్నారు.మండల స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుడి వరకు ఈ ప్రక్రియనే కొనసాగనుంది. నామినేషన్ దాఖలు నుంచి ఫలితాల వెల్లడి వరకు పూర్తిగా ఆన్ లైన్ విధానంలోనే చేపట్టనున్నారు. పటాన్ చెరు నియోజకవర్గ అధ్యక్ష బరిలో దండ్ల కిరణ్ కుమార్ ఉండనున్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అమూల్యమైన ఓటు ఆన్ లైన్ పద్ధతి ద్వారా వేయాలని దండ్ల కిరణ్ కుమార్ విన్నవించుకున్నారు.తమ గెలుపులో భాగస్వామ్యం కావాలని కోరారు.
*అంతా ఆన్ లైన్ లోనే..*
ఆన్ లైన్ ఎన్నికల నిర్వహణ కోసం”విత్ ఐవైసి”అనే ప్రత్యేక యాప్ ను ఉపయోగిస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ ఆన్ లైన్ పద్ధతిలో ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.బరిలో నిలిచిన అభ్యర్థి దండ్ల కిరణ్ కుమార్ పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ఆశీస్సులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువత మద్దతును కూడగట్టుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.పోటీలో పాల్గొనొన్న అభ్యర్థి దండ్ల కిరణ్ కుమార్ గతంలో కృష్ణారెడ్డి పెట్ విలేజ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా,అమీన్ పూర్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోరుకునే తనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు దండ కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.