మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతిక్యానికి నివాళులు అర్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసినా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా వారు అందించిన సేవలను స్మరించుకున్నారు.
దేశం గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయిందన్నారు. వారి మరణం దేశానికి తీరని లోటు అన్నారు.
మన్మోహన్ సింగ్ దేశ ప్రధాని గా పనిచేసిన కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
మాజీ ప్రధాని పీ.వీ.నర్సింహారావు మార్గదర్శకంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ కు దక్కిందన్నారు.
ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కిందన్నారు.
దివంగత నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మ శాంతించాలని కోరుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.