తెలంగాణ పోలీస్ సంక్రాంతి పండగకు ఊరికి వెళ్ళే ప్రజలకు దొంగతనాల నివారణ గురించి జగదేవపూర్ పోలీస్ వారి ముఖ్య సూచనలు

తెలంగాణ పోలీస్

సంక్రాంతి పండగకు ఊరికి వెళ్ళే ప్రజలకు దొంగతనాల నివారణ గురించి జగదేవపూర్ పోలీస్ వారి ముఖ్య సూచనలు

 

మీరు ఊరికి వెళ్ళే సమయంలో వీలైనంత మేరకు ఇంటిలో విలువైన వస్తువులు, నగదు మరియు బంగారం ఆభరణాలు పెట్టకండి వాటిని బ్యాంకు లాకర్లో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం.

 

బీరువా తాళం చెవులు బీరువా పైన కానీ, బీరువాలోని బట్టల క్రింద, ఇంట్లో పెట్టి వెళ్లవద్దు.

వాహనాలను ఇంటి వద్దనే పార్క్ చేసి తాళం చెవులు వెంట తీసుకుని వెళ్తే మంచిది.

ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి బయట గొళ్ళెం పెట్టకండి.

ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు, తాళం కనపడకుండా కర్టెన్స్ వేయాలి.

ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచండి.

బయట గేటుకు లోపల నుంచి తాళం వేయండి.

బయటకు వెళ్ళేపుడు ఇంట్లో మరియు బయట లైట్ వేసి ఉంచండి.

పేపర్ బాయ్ మరియు పాలు వేసే వాళ్లకు రావద్దని చెప్పండి.

నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే నియమించుకోండి.

మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి.

 ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి పక్క వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉండాలి.

బయటకు వెళ్లేటప్పుడు, వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు జాగ్రత్త. వీలైతే చీర కొంగుతో కవర్ చేసుకుంటే మంచిది.

మీ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది, భద్రత ఎక్కువగా ఉంటుంది.

మీ ఇంటికి సీసీ కెమెరాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని DVRని రహస్య ప్రదేశాలలో భద్రపర్చుకోవాలి. మరియు మొబైల్ యాప్ ద్వారా సీసీకెమెరా దృశ్యాలు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం ఉంటుంది.

మీరు బస్సు లేదా రైలు ప్రయాణ సమయంలో అపరిచిత వ్యక్తులు ఇచ్చిన తిను బండారాలుతీసుకోకూడదు, మీ వెంట విలువైన వస్తువులను తీసుకుని వెళుతున్నట్లయితే అట్టి బ్యాగును మీ దగ్గరే జాగ్రత్తగా అంటి పెట్టుకుని ఉంచుకోవలెను.

మీరు బయటికి వెళ్ళే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయకండి.

మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు గాని,

 

జగదేవపూర్ పోలీస్ స్టేషన్

 87126 67339 కు

 డయల్ చేయండి.

 

సంక్రాంతి శుభాకాంక్షలతో….”

 

బి. చంద్రమోహన్.

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 

జగదేవపూర్ పోలీస్ స్టేషన్

Join WhatsApp

Join Now

Leave a Comment