ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొని విద్యార్థిని మృతి.
పాఠశాల బస్సులు ధ్వంసం చేసిన గ్రామస్తులు.
చార్మినార్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 23.
పెద్ద శంకరంపేట్. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట లోని సాయి చైతన్య ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు ఢీకొని అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన సంఘటన పెద్ద శంకరంపేట మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మక్త లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన బోయిని అశ్విని (6) పెద్ద శంకరంపేట లోని సాయి చైతన్య స్కూల్లో ఒకటవ తరగతి చదువుతుంది. ప్రతిరోజు మాదిరిగానే బుధవారం కూడా పాఠశాల ముగిసిన అనంతరం గ్రామాలలో పిల్లలను దించేందుకు వెళ్లిన బస్సు లక్ష్మాపూర్ లో అశ్విని అనే విద్యార్థిని దించిన సమయంలో విద్యార్థిని ఎటు వెళ్తుందో గమనించకుండా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పాఠశాల బస్సు ఢీకొనడంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యమే విద్యార్థిని మృతికి కారణంగా పేర్కొంటున్నారు. తెలుస్తుంది. వెంటనే అక్కడే ఉన్న గ్రామస్తులు ఆగ్రహించి సాయి చైతన్య పాఠశాల బస్సు అద్దాలు కిటికీలను ధ్వంసం చేశారు. సంఘటన స్థలంలో విద్యార్థిని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు రహదారి పైన కూర్చుని రోదిస్తున్న తీరు అందరిని కలిసివేసింది. మక్త లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన బోయిని చందు సరితల కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె అశ్విని పాఠశాల ముగించుకొని ఇంటికి వస్తుందని ఎంతో ఆశగా తల్లిదండ్రులు ఎదురు చూస్తుండగా ఇంతలోనే అశ్విని మృతి చెందిన పట్ల వారు రోధిస్తున్న తీరు అందర్నీ కలిసివేసింది. పాఠశాల యాజమాన్యం పై బస్సు డ్రైవర్ పై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సంఘటన స్థలానికి అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి పెద్ద శంకరంపేట ఎస్సై శంకర్. ఏ ఎస్ ఐ సునీత పులి సిబ్బంది చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.