*బాంచ వారి నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులి మామిడి రాజు*
సదాశివపేట పట్టణంలోని పాతకేరి, ఈశ్వర మందిర ఆలయ సమీపం నందు నూతనంగా నిర్మించిన నూతన గృహప్రవేశంనకు ముఖ్యతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు విచ్చేసి బాంచ భారతమ్మ, రాములు కుటుంబ సభ్యులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి సత్యనారాయణ స్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్, (13వ ) వార్డు కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, దీపక్ బజాజ్, చాపల హన్మంతు, మునిపల్లి రమేష్, తాలెల్మ రాము, శ్రీనివాస్ ముదిరాజ్, బాంచ సతీష్, రాజేష్, నీలి శ్రీనివాస్, అనిల్, వెంకట్, వేణు, సోమ శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.