సెయింట్ ఇసాక్ అడ్వెంట్ హై స్కూల్ సెలబ్రేషన్స్
కార్యక్రమం లో పాల్గొన్న
పి ఏ సీ చైర్మన్ గాంధీ
ఎంఎల్ఏ కాలే యాదయ్య
మాజీ ఎంపీ ఆజారుద్దిన్
చందానగర్ డివిజన్ పరిధిలోని పి జె ఆర్ స్టేడియంలో సెయింట్ ఇసాక్ అడ్వెంట్ హై స్కూల్ వారి రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా నిర్వహించిన స్పోర్ట్స్ డే కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సెయింట్ ఇసాక్ అడ్వెంట్ హై స్కూల్ వారి ఆధ్వర్యంలో రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా నిర్వహించిన స్పోర్ట్స్ డే కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం అని, టగ్ ఆఫ్ వార్,త్రో బాల్,ఖో,ఖో,క్రికెట్ మరియు రన్నింగ్ వంటి ఆటలు నిర్వహించడం జరుగుతుంది , పిల్లలలో దాగిన సృజనాత్మకత ను బయటకి వెలుగు దీయడానికి ఎంతగానో తొడపడుతుంది అని , పిల్లలకు చదువు తో పాటు క్రీడలు ఎంతగానో ముఖ్యం అని ,క్రీడల తో శారీరక శ్రమ తో పాటు మానసిక ఉల్లాసం కలుగును అని , పిల్లలు చదువుల తో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుడే మంచి భావి పౌరులుగా దేశానికి సేవలు అందిస్తారు అని,తల్లిదండ్రులకు ,దేశానికి మంచి సేవలు అందించాలని ,విద్య అభివృద్ధి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది అని చైర్మన్ గాంధీ పేర్కొన్నారు.
అదేవిధంగా నా దృష్టికి వచ్చిన మీ ప్రతి సమస్య పరిష్కారానికి నా వంతు శాయశక్తులా కృషి చేస్తానని , మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పారిష్కారం అయ్యలే తన వంతు కృషి చేస్తానని , నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని చైర్మన్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, గణేష్ ముదిరాజ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,ప్రసాద్, అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా మరియు సెయింట్ ఇసాక్ అడ్వెంట్ హై స్కూల్ ఇసాక్ లజర్స్, ప్రిన్సిపాల్ కమర్ జాన్ ఇసాక్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు మొదలగు వారు పాల్గొన్నారు.