*శ్రీ దత్తాత్రేయ జయంతి మహోత్సవ ఆహ్వాన కరపత్రికను ఆవిష్కరించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు
సదాశివపేట పట్టణంలోని బృందావన్ ఫ్రేమ్స్ గార్డెన్ నందు శ్రీ దత్త జయంతిని పురస్కరించుకొని బర్దిపూర్ ఆశ్రమం నందు డిసెంబర్ 8 ఆదివారం నుండి డిసెంబర్ 17 మంగళవారము వరకు నిర్వహించే శ్రీదత్తాత్రేయ జయంతి కార్యక్రమముల ఆహ్వాన కరపత్రికను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. తదుపరి అవధూత గిరి మహారాజ్ మాట్లాడుతూ డిసెంబర్ 15వ తేదీన శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్బంగా బర్దిపూర్లో మూడు రోజులపాటు శ్రీ దత్తాత్రేయ యజ్ఞం (21 యజ్ఞ గుండములతో ) శ్రీ పునీత్ కుమార్ దీక్షితులు పరమేశ్వర శాస్త్రి పర్యవేక్షణలో శ్రీ చండీయాగం జరుగుతుందని, ఇట్టి కార్యక్రమాలకు భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ భగవత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పత్రిక ముఖంగా విన్నవించారు. ఈ కార్యక్రమాలన్ని శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాల విద్యార్ధుల పర్యవేక్షణలో జరుగును. ప్రతి రోజు అన్న దాన కార్యక్రమం నిర్వహించబడును. కావున భక్తులు తన, మన, ధనములను సమర్పించి, ఆ భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అర్చకులు సోమేశ్వర్ , అఖిల్ , మిత్రులు దీపక్ బజాజ్, వల్లభాయ్ పటేల్ , వినోద్ పటేల్ , శేఖర్, చాపల హన్మంతు, సోమ శంకర్ .ఎం.ఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, తాలెల్మ రాము, నరేష్, మనోజ్, అఖిల్ పాల్గొన్నారు.