కొప్పల్ ఉమా సంగమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు.
చార్మినార్ ఎక్స్ ప్రెస్:ఆగస్టు 5 ,పెద్ద శంకరంపేట్.
పెద్ద శంకరంపేట్. శ్రావణమాసం తొలి సోమవారం పురస్కరించుకొని పెద్ద శంకరంపేట మండల పరిధిలోని ఉమా సంగమేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జాము నుండే భక్తులు సమీప కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.