పాఠశాలలు సక్రమంగా నడిచే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్
భద్రాచలం:గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థుల విద్యా బోధన పట్ల సంబంధిత ఏటీడీవోలు, స్పెషల్ ఆఫీసర్లు వారి పరిధిలోని పాఠశాలలను ప్రధానోపాధ్యాయులతో సమన్వయంగా ఉండి పాఠశాలలు సక్రమంగా నడిచే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు.శుక్ర వారం తన చాంబర్లో ఏటీడీవోలు,పాఠశాలల ప్రత్యేక అధికారులతో పాఠశాలల పనితీరుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పనితీరు బాగాలేదని, పిల్లలకు సరియైన పద్ధతిలో విద్యాబోధన జరగడం లేదని, కొన్ని పాఠశాలల్లో పిల్లల చేత పనులు చేస్తున్నారని, ప్రధానో పాధ్యాయుల అనుమతి లేకుండా పాఠశాలల విద్యార్థినిలు నుండి వెళ్లిపోవడం, పరిశుభ్రత పట్ల శ్రద్ధ తీసుకోవడం వంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయని, ఏ సమాచారం వచ్చినా ముందుగా డిడి ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా తన దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు.ఉపాధ్యాయులకు బదిలీలు అవుతున్నాయని అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల విద్యాబోధనపై అశ్రద్ధ చూపుతున్నారని, వారు వెళ్లే వరకు తప్పనిసరిగా విద్యార్థిని, విద్యార్థులకు తప్పనిసరిగా విద్యాబోధన చేయాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.కొన్ని పాఠశాలల్లో పిల్లలకు గైడ్ల ద్వారా టెస్టులు నిర్వహిస్తున్నారని,స్వయంగా ఆకస్మికతనికి సమయంలో నా దృష్టికి వచ్చిందని, ఇకముందు గైడ్ల ద్వారా టెస్టుల నిర్మించే పద్ధతి మానుకోవాలని అన్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు సరిపడా భోజనము అందడం లేదని,రాత్రిపూట మిగిలినవి కూడా పిల్లలకు సరఫరా చేస్తున్నారని,మెనూపై సంబంధిత డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారినిలు,ఏటీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఏటీడీవోలు,స్పెషల్ ఆఫీసర్లు తప్పనిసరిగా వారానికి రెండు సార్లు అయినా మీకు సంబంధించిన పాఠశాలలను తనిఖీ చేయాలని, ఉదయం కానీ,సాయంత్రం కానీ ఆకస్మిక తనిఖీ చేసి,పిల్లల యొక్క మానసిక స్థితిగతులను తెలుసుకొని విద్యాబోధన ఎలా జరుగుతున్నది,పిల్లల చేత అడిగి తెలుసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు.ముఖ్యంగా విద్యార్థిని, విద్యార్థుల ఆరోగ్య సమస్యలు, సబ్జెక్టుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, సాయంత్రం పూట పిల్లలు యొక్క విద్యా బోధన సంబంధిత టీచర్లు వంతుల వారీగా నిర్వహించాలని తెలిపారు. అలాగే ఎస్ సి ఆర్ పి లు వారి పరిధిలోని జిపిఎస్ పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండి, జిపిఎస్ నుండే విద్యాబోధన పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై సంబంధిత డీడీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ప్రతి పాఠశాలలో లైబ్రరీ నిర్వహణ, ల్యాబ్ నిర్వహణ జరిగేలా చూడాలని అన్నారు. కొన్ని పాఠశాలల్లో పిల్లలు కూర్చొని భోజనం చేయడానికి డైనింగ్ హాల్స్ లేవని, డార్మెటరీ, డైనింగ్ హాల్, మంచినీరు బాలికల పాఠశాలల్లో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ కు ఆదేశించారు. మరల సమావేశానికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఏటీడీవోలు స్పెషల్ ఆఫీసర్లు పాఠశాలలలో పర్యవేక్షణ నివేదికలు తీసుకొని రావాలని ఏ పాఠశాల నుంచి అయిన,ఎవరి ద్వారానైనా కంప్లైంట్ లు వస్తే సంబంధిత ఏటీడీవోలు,హెచ్ఎంలు,సబ్జెక్ట్ టీచర్లపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారినిలు మణెమ్మ, విజయలక్ష్మి, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ,ఏడి అగ్రికల్చర్ భాస్కర్,ఏసీఎంఓ రమణయ్య,డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్,ఏటీడీవోలు జహీరుద్దీన్,సత్యవతి,అశోక్,చంద్రమోహన్,రాధమ్మ,జి సి డి ఓ మంగతాయారు,జేడీఎం హరికృష్ణ మరియు డీఈలు,ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.