మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

 

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ నవంబర్ 21*

బిల్డింగ్ పైనుండి దూకి ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
గుంటూరు జిల్లా అమరావతి మండల్,నెమలికలన్ కు చెందిన వంగా నవీన్ రెడ్డి(24)….
నగరానికి వచ్చి మాదాపూర్ మైండ్ స్పేస్ లోని ఓ సాప్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్న వంగా నవీన్ రెడ్డి ఈ క్రమంలో గురువారం ఉదయం
తను పని చేస్తున్న సాప్ట్ వేర్ కంపెనీ భవనం 13 వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆత్మహత్యకు గల కారణాలు తెలియల్సి ఉంది
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించిన మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment