మైనార్టీ కమ్యూనిటీ హాల్ స్థల పరిశీలన
నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక సోఫీ నగర్ వార్డ్ నెం. 14 లో గురువారం మైనార్టీ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని పరిశీలించి, సర్వేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ కమర్, స్థానిక వార్డ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సల్మాన్, కమిటీ సభ్యులు ఇతర ప్రభుత్వ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.