స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన
సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు
చార్మినార్ ఎక్స్ ప్రెస్ కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా
సిర్పూర్ టి ప్రతినిధి
ఆగస్టు5
కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా
కాగజ్ నగర్ పట్టణంలోని లారీ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ దీపక్ తివారితో పాటు పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.అనంతరం కాగజ్ నగర్ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందిఈ కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, మున్సిపల్ ఛైర్మన్ షాహీన్ సుల్తానాపట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్ దెబ్బటి శ్రీనివాస్ భాజపా కోశాధికారి అరుణ్ లోయ మరియు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.