సిర్గాపూర్ బంద్ ప్రశాంతం హిందూ సంఘాల ఆధ్వర్యంలో

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం నిందితుడికి ఉరి తీయాలి.

హిందూ దేవతలపై దాడులు సహించేది లేదు.

హిందువులపై పోలీసుల లాఠీచార్జి ఒక పిరికిపంద పని అన్నారు.

ఈ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు

ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం అయితే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు.

జైశ్రీరామ్ అంటూ హిందు సంఘాలు నాయకులు నిరసన తెలిపారు.

సిర్గాపూర్ మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం శాంతియుతా వాతావరణంలో బంద్ కొనసాగింది దీనికి ఇతర హిందూ సంఘాలు అలాగే వ్యాపార సంస్థలు మద్దతు ఇచ్చాయి.ఈ సందర్భంగా హిందూ సంఘాలు నాయకులు మాట్లాడుతూ ఈనెల13అర్ధరాత్రి సమయంలో సికింద్రాబాద్​ మోండా మార్కెట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.ఎవరైతే ముత్యాలమ్మ విగ్రహ దాడి నిందితుడు సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్(30)ను ఊరి తీయాలని డిమాండ్ చేస్తూ.రోజురోజుకు హిందూ దేవుళ్ళ పై హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసంకు నిరసనగా హిందూ ధార్మిక సంఘాలు శాంతియుతంగా నిరసన తెలుపుతూన్నా క్రమంలో పోలీసులు హిందువులపై కర్కషత్వం వహించి లాఠీఛార్జ్‌ చేశారని పోలీసుల లాఠీఛార్జ్​లో ఆందోళనకారుల్లో కొందరి తలలకు,ఇతర శరీరభాగాలకు గాయాలయ్యాయి.లాఠీఛార్జ్​లో తన ఎడమ చెయ్యి విరిగిందంటూ దుర్గా అనే యువకుడు నేలపై కూలబడ్డాడు అని బావోద్వేగం చెందారు.హిందూ దేవుళ్ళ పై దాడి చేసే వారిపై కఠినంగా శిక్షిస్తేనే మళ్లీ ఇలాంటివి జరగవని హిందువులకు రక్షణగా ఉంటుందని వాపోయారు.అలాగే అక్కడక్కడ హిందు సంఘాలు నిర్వహిస్తున్న బంద్ ను హిందువులు ప్రజలు సహకరించాలని కోరూతూ.ఈ నిరసన కార్యక్రమంలో హిందు సేన కార్యకర్తలు నాయకులు హిందు సేన యువకుల చిన్నారులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment