మతసామరస్యానికి పోలీస్ స్టేషన్ వేదికగా వినాయకుడిని కూర్చోబెట్టి పూజించిన ముస్లిం మహిళ ఎస్ ఐ జుబేదా బేగం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో వినాయక చవితి నవరాత్రుల మహోత్సవాలు శనివారం పోలీస్ స్టేషన్ లో జరుపుకున్నారు వినాయక మండపం ఏర్పాటు చేసి స్టేషన్ హౌస్ మాస్టర్ ఎస్ ఐ జుబేదా బేగం మతసామరస్యానికి వేదికగా హిందూ ముస్లిం ఐక్యతను చాటుతూ ఆమె పోలీస్ స్టేషన్ లో గణనాథుడికి వినాయకచవితి పూజా కార్యక్రమాలు నిర్వహించారు తాము దైవాన్ని నమ్ముతామని కులమతాలకు తాము అతీతమని నిరూపించారు పండుగలు పర్వదినాలు శుభకార్యాలు జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం కుటుంబ సభ్యుల మధ్య బాంధవ్యాలు గట్టిగా ఉండాలని ప్రతి ఒక్కరు ఐక్యమత్యంగా ఉండి ఒక్కటిగా సాగాలని ముఖ్య ఉద్దేశం అన్నారు ప్రజల మధ్య ఐక్యత ఉంటే మత సామరస్యం వెళ్లి విరుస్తుందని అన్నారు కుల మతాల భేదం లేకుండా అందరూ అన్నదమ్ముల కలిసి ఉండాలని తెలియజేశారు పూజా కార్యక్రమంలో స్టేషన్ హౌస్ కు వచ్చిన వారికి స్వామివారి దర్శనం కల్పించి స్వామి తీర్థప్రసాదములను దగ్గరుండి పంచిపెట్టారు ఈ విషయం తెలిసిన వారు ఎస్ ఐ జుబేదా బేగం ను పలువురు ప్రశంసిస్తున్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది అలాగే స్టేషన్ పనుల పై వచ్చిన వారు తదితరులు వినాయక చవితి పూజలో పాల్గొన్నారు