రోడ్డు పై పారుతున్న మురుగు నీరు

జహీరాబాద్ నియోజకవర్గం చార్మినార్ ఎక్స్ ప్రెస్  (ప్రతినిధి) జానా రెడ్డి ఆగస్టు 21
జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్ ఎక్స్ రోడ్ కీ పక్కనే ఉన్న ఆనంద్ నగర్ కాలనీలోని రోడ్లు చెరువులని తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల మురికి కాలువలు లేక మరికొన్ని చోట్ల వాటి నిర్వహణ సరిగా లేక రోడ్డు మీదనే మురుగునీరు ఆగుతుంది. దీంతో సాదారణ ప్ర జలు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఈ కాలనీలు జహీరాబాద్ మున్సిపాలిటీలో కలిసినప్పటినుంచి మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడంతో ప్రజలు తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అధికారులకు విన్నవించిన వారు తగిన రీతిలో స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను అతిత్వరగా తీర్చాల్సిందింగా కాలనీవాసులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment