చెన్నా రెడ్డి కాలనీ లో నిన్న రాత్రి జరిగిన గణపతి వేడుకల్లో పాల్గొన్న – సీనియర్ బీజేపీ నాయకురాలు జ్యోతి పండాల్
గత కొన్ని రోజుల నుండి శివ శక్తి టీమ్ వారు ప్రతి గణపతి మండపానికి వెళ్లి వినాయక పండగ ప్రాముఖ్యత గురించి వివరించడం జరుగుతుంది. కావున నిన్న రాత్రి చెన్నా రెడ్డి కాలనీ లో నిర్వహించిన వినాయక పూజ వేడుకలో మరియు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని శివ శక్తి టీమ్ వారు చేస్తున్న సేవలను మరియు విశ్వ హిందూ పరిషత్ ప్రచారాక్ అయినటువంటి పెద్దలు మరియు పూజ్యులు రామ్ రెడ్డి సేవలను అభినందిస్తూ జ్యోతి పండాల్ సన్మానించారు. శివ శక్తీ టీమ్ వారు చేస్తున్న సేవలకి అభిమానించే జ్యోతి పండాల్ నీ కూడా శివ శక్తి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు శాల్వతో సన్మానించి రామ మందిర్ జ్ఞాపికను బహుకరించారు. ఇంత మంచి ఆధ్యాత్మికమైన సేవలను మన సమాజానికి అందిస్తున్న పెద్దలతో పాటు వేదికపైన స్థానం ఇచ్చి గౌరవించిన పెద్దలకి, ఆ కాలనీ వాసులకి మరియు ఇలాంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్న రాజేష్ కి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు జ్యోతి పండాల్. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్, శివ శక్తి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, శివ శక్తి రాష్ట్ర నాయకులు సతీష్ రాచురి, శివ శక్తి మండల్ ప్రెసిడెంట్ మహేశ్వర్, స్టేట్ విశ్వ హిందూ పరిషత్ పెద్దలు మరియు పూజ్యులు రామ్ రెడ్డి, రాజేష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.