అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత ఎక్స్గ్రేషియా చెక్ అందజేత

అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత ఎక్స్గ్రేషియా చెక్ అందజేత

పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కె. లక్ష్మి నారాయణ హెచ్ సీ 1583 అనారోగ్యంతో మరణించగా ఆయన భార్య శంకరమ్మ కి భద్రత ఎక్స్గ్రేషియా 8,00,000/- రూపాయల చెక్ ను ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ) తన కార్యాలయం లో వారికి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా మరణించి హెడ్ కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ గారు అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని సీపీ అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, సూపరిండెంట్ సంధ్య, జూనియర్ అసిస్టెంట్ నజియా ఇరమ్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Latest Stories

Leave a Comment