అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన సర్పంచ్ అభ్యర్థి
పొన్కల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జాడి బుచ్చవ్వ.ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ అభ్యర్థి రాగుల శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించి పండ్లు,బ్రెడ్ మరియు ఆర్థిక సహాయం అందించారు.త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థించారు. ఇలా పొన్కల్ గ్రామపంచాయతీలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ ఆర్థిక సహాయం అందిస్తూ గ్రామపంచాయతీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంటూ,ముందుకు కొనసాగుతున్నాడు..