ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
మంథనిలోని స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల (బాలికలు) లో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థునిలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీకి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ హాజరయి మాట్లాడుతూ సాంప్రదాయానికి నిలువుటద్దంగా సంక్రాంతి పండుగ అని తెలియజేస్తూ సాంప్రదాయాలను విద్యార్థినిలు ఎవరు మర్చిపోకూడదని ఇప్పటికే పల్లెటూరులో సైతం పండగలను మర్చిపోతున్నారని హరిదాసు వేషాలు గంగిరెద్దులు ఎక్కడా కానరావడం లేదని సంక్రాంతి పండగ ఉమ్మడి కుటుంబాలతో సంతోషంగా జరుపుకునే రోజులు లేకుండా పోయాయని నేటి సోషల్ మీడియా కాలంలో విద్యార్థినిలు ఎవరు కూడా పండగ సంప్రదాయాలను విస్మరించవద్దని సాంప్రదాయాలను కాపాడడం కోసమే ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ముగ్గుల పోటీల అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మరియు యాజమాన్యంతో కలిసి విజేతల పేర్లను నిర్ణయించడం జరిగిందని తెలియజేశారు ముగ్గుల పోటీ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత అధ్యాపక బృందం తో పాటు డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రెంకల సురేష్ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు బందెల రాజ్ కుమార్ డివైఎఫ్ఐ నాయకులు అన్వేష్ ,కృష్ణ రమేష్ కళాశాల విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు