శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
సూర్యాపేట* దురాజ్పల్లి సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు కోలాహలంగా నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నేలపై హరివిల్లును తలపించే రంగులతో ముగ్గులు వేశారు. పాఠశాల ప్రాంగణాలను ముత్యాలముగ్గుల లోగిల్లుగా మార్చేశారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భోగిమంటలు, గొబ్బెమ్మలు, హరిదాసు చిత్రాలు వంటి అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. మరి కొంతమంది మహిళలు సందేశాత్మక ముగ్గులు వేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ పోటీలలో పాల్గొని అందమైన రంగవల్లులను తీర్చిదిద్దిన మహిళలను పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్. శ్రీనివాస్ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ హార్దిక్, ఉపాధ్యాయుని బృందం పాల్గొనడం జరిగింది.