జయ’ లో సంక్రాంతి సంబురాలు

‘జయ’ లో సంక్రాంతి సంబురాలు

 

సూర్యాపేట జయ ఒలంపియాడ్ పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో పాఠశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని ప్రాంగణాన్ని రంగు రంగుల ముగ్గులతో అలంకరించారు. పోటీలో దాదాపు 500 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. పోటీ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి. జ్యోతి, జెల్లా.పద్మ లు మాట్లాడుతూ విద్యార్థులకు చదువులు ఆటపాటలే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలు మరియు పండుగల విశిష్టతల గురించి తెలుసుకొనుటకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపే విధంగా హరిదాసులు, గంగిరెద్దులు, పతంగులను ముగ్గులలో రంగు రంగులతో వేసి, పాఠశాల ప్రాంగణం అంతా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడేలా చేసారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment