గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ అమ్మకాలపై సంగారెడ్డి రూరల్ పోలీసుల దాడులు.

 

 గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ అమ్మకాలపై సంగారెడ్డి రూరల్ పోలీసుల దాడులు.

 ఐఐటి-కంది పరిసర ప్రాంతాలలో పాన్ యజమానుల బైండ్ ఓవర్..

జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపియస్. గారి ఆదేశానుసారం సంగారెడ్డి రూరల్ ఎస్ఐ విశ్వజన్, తన సిబ్బందితో కలిసి ఐఐటి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న పాన్ షాప్ లపై దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో ప్రభుత్వంచే నిషేదించబడిన గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ లు అమ్ముతున్న 4- పాన్ షాప్ లను గుర్తించి, అట్టి షాప్ యజమానులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని భవిష్యత్తులో తిరిగి ప్రభుత్వ నిషేదిత గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ లను అమ్మకుండ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని ఎస్పీ గారు వివరించారు. జిల్లాలో జరుగుతున్న అక్రమాలపై S-Nab నెంబర్ 8712656777 లేదా డయల్ 100 చేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment