సంగారెడ్డి జిల్లా ఆందోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మంత్రి దామోదర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ
గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గానికి చేసిందేంటని ఆందోల్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు.
వాయిస్ ఓవర్:
జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో పలువురు నాయకులు మాట్లాడుతూ గతంలో కూడా మంత్రి దామోదర్ రాజనర్సింహ హయములోనే అభివృద్ధి ముందుకు సాగిందని, ప్రస్తుతం కూడా నియోజకవర్గం అభివృద్ధి దిశలో ముందుకు దూసుకెళ్తుందని వారు అన్నారు. తమ నాయకుడు దామోదర్ రాజనర్సింహ పై లేనిపోని అభండాలు వేసేముందు నిజాలు తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కోరారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డ్ కౌన్సిలర్ చిట్టిబాబు కౌన్సిలర్ సురేందర్ గౌడ్ కౌన్సిలర్ పట్లులో ప్రవీణ్ మార్కెటింగ్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు