రైతు భరోసా వెంటనే రైతుల ఎకౌంట్ లో జమ చేయాలి

రైతు భరోసా వెంటనే రైతుల ఎకౌంట్ లో జమ చేయాలి

తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం వెంటనేరైతు భరోసాను విడుదల చేసి రైతుల అకౌంట్ లో నగదు జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులందరికీఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో వ్యవసాయానికి 1,50,000 కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల దేశ రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. బడ్జెట్ ను సవరించి వ్యవసాయ రంగానికి 25 శాతాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కనీస మద్దతు ధరలకు చట్టం చేయాలని, దేశ రైతాంగానికి ఉన్న అన్ని అప్పులను మాఫీ చేయాలనిడిమాండ్ చేశారు.రైతులకు 55 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని కోరారు.దేశ రాజధానిలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతాంగ పోరాడుతున్నప్పటికీ గతంలో బిజెపి ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీలను నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. రైతాంగానికి వరి పంటకు బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిందని వానాకాలం నుండే బోనస్ అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయానికి డీజిల్ సబ్సిడీ ధరకే అందించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులను సమీకరించి పోరాడుతామని అన్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత, కందాల శంకర్ రెడ్డి, జిల్లా నాయకులు దేవరం వెంకటరెడ్డి, షేక్ సైదా, పందిరి సత్యనారాయణ రెడ్డి, దండ శ్రీనివాస్ రెడ్డి, నారాయణ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment