ప్రయాణికుల సేవలో ఆర్టీసీ

*ప్రయాణికుల సేవలో ఆర్టీసీ*

జహీరాబాద్ నియోజకవర్గం చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ఆగస్టు 26
ఈ రోజు ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఆపరేషన్స్ శ్రీ.దైవదీనంజహీరాబాద్ డిపోలో ఇన్స్పెక్షన్ నిర్వహించారు.ఇట్టి ఇన్స్పెక్షన్ లో భాగంగా డిపో ను రివ్యూ చేసి సంతృప్తి వ్యక్తపరిచారు మరియు ఉద్యోగులతో గేట్ మీటింగ్ నందు సమావేశమై శ్రావణ మాసం లో రాఖీ పండుగ నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీ కి అనుగుణంగా సర్వీసులు నడిపి ప్రయాణీకులకు అసౌకర్యం కలుగకుండా సేవలు అందించిన సిబ్బంది సేవలను ప్రశంసించారు.తదుపరి ఉద్యోగులతో కలిసి డిపో ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ వన మహోత్సవ కార్యక్రమం మరియు సమావేశం లో డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ , అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ ఇంజనీర్, డ్రైవర్ కండక్టర్ లు, గ్యారేజ్ సిబ్బంది, ట్రాఫిక్ అధికారి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment