అధికారుల లొపం వల్ల భారీ వర్షాలకు గుంతలు పడ్డ రోడ్లు
సుజాతనగర్ కురుస్తున్న భారీవర్షాలకుమండలంలోని పలుపంచాయతీలలో రోడ్లు గుంతలహమయంఅయినాయి.హనచొధకులు,పాదాచారులు అనేకఇక్కట్లుపడుతున్నామ రోడ్లపై పడిన గుంతల్లో వర్షపునీరు మురుగునీరు నిల్వ ఉండడంతో క్రిమి కీటకాలు తయారవుతున్నాయి.
అనేక రోగాలకు కారణాలుగామారుతున్నాయి. అసలే వర్షాకాలంకావడంతో పలు పంచాయతీలలో పేరుకుపోయిన చెత్తాచెదారాలు పిచ్చి
మొక్కల వలన అనేక రకాల దోమలు కీటకాలు తయారయ్యి ప్రజలకు
డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బులుప్రబలుతున్నాయి.మండలంలోనిరోడ్లకు ఇరువైపులానిర్మించవలసిన డ్రైనేజీలు నిర్మించకపోవడం వల్లరోడ్లపై ప్రవహించడం వల్ల రహదారులు ధ్వంసం అవుతున్నాయి. దీనికి
తోడు వర్ష భావం ఎక్కువగా ఉండటం వల్ల రోగుల సంఖ్య సైతంఎక్కువగానే ఉంది. పంచాయితీలలోని అధికారులుసిబ్బందిపేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య
కార్యక్రమాలు చేపడితే ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు
అవకాశాలు ఉన్నాయి. పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యం పై ప్రజలకు
అవగాహన కల్పిస్తూ తగు చర్యలను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలను
కాపాడవలసిన బాధ్యత అధికారుల పైనే ఉన్నదనేది కొంతమంది మండల ప్రజల మాట