ఆర్థిక సాయం చేసిన బీజేపీ రాష్ట్ర యువ నాయకులు రితీష్ రాథోడ్
జన్నారం మండల బిజెపి ప్రధాన కార్యదర్శి వంగపల్లి సురేష్ ఫోన్ చేసి విషయం తెలుపగానే రితిష్ రాథోడ్, తన తండ్రి అయిన రమేష్ రాథోడ్ లేని లోటును ఖానాపూర్ ప్రజలకు నేనున్నానంటూ ఎలాంటి కష్టం వచ్చినా తన తండ్రి లాగానే పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఇందన్ పల్లి గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన మహిళకు ఆర్థికసాయంగా 4000 రూపాయలు పంపించడం జరిగింది.ఆ ఆర్థిక సహాయాన్ని జన్నారం మండలం ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి నల్లపు కృష్ణ మూతి రాజుకి ఇవ్వడం జరిగింది.అలాగే ఆ గిరిజన మహిళకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని వస్తే ఐ టి డి ఐ ద్వారా డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పడం జరిగింది.