ఉద్యోగవిరమణ పొందిన ఏఎస్ఐ నాగయ్య
సన్మానించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్
మద్దిరాల పిఎస్ నందు హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న నాగయ్య ఈరోజు ఉద్యోగవిరమణ పొందినారు. ఈ సందర్భంగా ఏ ఎస్ ఐ దంపతులను వారి కుటుంబ సభ్యుల, స్నేహితుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యలయంలో ఎస్పి సన్మానించారు. నాగయ్య కు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోలీసు డిపార్ట్మెంట్ నందు సుదీర్ఘకాలం సేవలు అందించడం గొప్పవిషయం అని, అభినందనీయం అని వారి సేవలను కొనియాడారు. ఈ ఉద్యోవిరమణ అనంతరము వారి కుటుంబ సభ్యుల అందరితో సుఖ సంతోషాలతో గడపాలని అని, ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాము అని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, ఏవో మంజు భార్గవి, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, సిబ్బంది, కుటుంభం సభ్యులు పాల్గొన్నారు.