మురికికాల్వలు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న ముల్కనూర్ కాలనీ వాసులు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మేజర్ గ్రామపంచాయతీ అయినా ముల్కనూర్ గ్రామంలో 8,9 వార్డ్ లో ఎన్నో సంవత్సరాల నుండి మురికికాల్వలు సరిగ్గా లేక కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.చాలా సార్లు గ్రామపంచాయతీ లో సర్పంచ్, గ్రామ ఈ. ఓ. కు చెప్పిన పట్టింకోవడం లేదని కాలని వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం లో అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. వర్షము నీరు అంతా ఇండ్లలోకి వస్తుంది.అంతేకాకుండా పాములు, తేల్లు వస్తున్నాయ్. ఎన్నికల సమయంలో ఓట్ల ఓట్ల కోసమే వార్డ్ మెంబర్లు వస్తున్నారు. తర్వాత మా వార్డును పట్టించుకోవడంలేదని చెప్తున్నారు.