రికార్డు స్థాయిలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలి
దేశంలో మరియు రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందంజలో ఉండి ప్రతి బూతు నుండి 300 మందికి పైగా సభ్యులుగా నమోదు చేయించాలని కోరిన,శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్*
*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ 29*
శేరిలింగంపల్లి మసీదుబండ, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్రరావు అధ్యక్షతన శేరిలింగంపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో నియోజకవర్గ ముఖ్య నాయకులు,డివిజన్ నాయకులు ,కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఒక మహా యజ్ఞంగా నియోజకవర్గంలో చేపట్టాలని, లక్ష యాభై వేల మందికి పైగా సభ్యులను నమోదు చేయించాలని సూచించారు,డివిజన్ల వారీగా ఇంచార్జులను , సహా ఇంచార్జులను, డివిజన్ కమిటీలను నియమించడం జరిగిందని, కార్యకర్తలు బూత్ స్థాయి నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు, ఈ నమోదు కార్యక్రమము ద్వారా రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ కార్పొరేషన్ సీట్లు గెలవడానికి, ప్రజలతో తో సత్-సంబంధాలు పెరుగుతాయని సూచిస్తూ నమోదు కార్యక్రమంలో టోల్ ఫ్రీ నెంబర్ 8800002024 కు మిస్డ్ కాల్ ఇప్పించి తద్వారా వచ్చిన లింక్ లో వారి వివరాలను పూర్తి చేయించాలని గుర్తు చేశారు, ప్రతి డివిజన్ నుండి 15000 పైగా సభ్యత్వలను నమోదు చేయించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తూ ,ప్రతి బూత్ నుండి 300 మందికి పైగా సభ్యులను నమోదు చేయాలని తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు , జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు ,సీనియర్ నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు.