మానవత్వాన్ని చాటుకున్న పూసం రవి కుమారి.
పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి అధ్యక్షులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు.
భద్రాచలం నన్నపనేని జడ్పీ హైస్కూల్లో వరద బాధితులైన అశోక్ నగర్ కొత్త కాలనీ వాసులైన బాధితుల కుటుంబాల్లో ఉన్న చిన్న పిల్లలకు మానవత దృక్పథంతో పూసం రవి కుమారి మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ప్రభుత్వం మధ్యాహ్న భోజన సదుపాయం అందించక పోవడంతో తమకున్న దాంట్లో చిన్న పిల్లల ఆకలి తీర్చేందుకు యాపిల్, అరటిపండు, బ్రెడ్ ఇచ్చి మాతృత్వాన్ని చాటుకున్నారని పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి అధ్యక్షులు కొమ్మకి వెంకటేశ్వర్లు తెలిపారు. వరద బాధితులకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులకు అండగా ఉండి వారి కుటుంబాల ను ఆర్థిక సహాయం చేసే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూసం రవి కుమారి అందరూ మానవత్వాన్ని చాటి వరద బాధితులకు అండగా నిలవాలని కోరారు.