రామాలయ ఉద్యోగి సస్పెండ్
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో టికెట్ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న రికార్డు అసిస్టెంట్ చంటి కుమార్ను సస్పెండ్ చేశామని ఈవో రమాదేవి తెలిపారు. రూ.3.42 లక్షలను చాలా రోజుల నుంచి దేవాలయ ఖాతాలో జమ చేయకపోవడంతో ఇటీవల మెమో ఇచ్చామన్నారు. అయినప్పటికీ ఆ మొత్తం జమ చేయకపోవడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని వెల్లడించారు.