పెద్ద శంకరంపేటలో గాయపరుస్తున్న వీధి కుక్కలు..! ప్రభుత్వాసుపత్రికి బాధితుల క్యూ

పెద్ద శంకరంపేటలో గాయపరుస్తున్న వీధి కుక్కలు..! 

 

_ ప్రభుత్వాసుపత్రికి బాధితుల క్యూ.

 

పెద్ద శంకరంపేట మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తు న్నాయి. మూడు నెలలుగా వీటి బెడద తీవ్రమైంది. ఇళ్లల్లోంచి వీధుల్లోకి రావాలన్నా భయం.చిన్న పిల్ల లను పనిమీద బయటకు పంపాలన్నా భయమే. చిన్నారులు ఇంటిముందు ఆడుకోవాలన్న ఆందోళన తప్పడంలేదు. ఇప్పటికే మండలంలో అధిక సంఖ్యలో ప్రజలు కుక్కకాటుకు గురయ్యారు. వీధి కుక్కల సంఖ్య పెరిగి ఏ కుక్క ఎటునుంచి వచ్చి కరుస్తుందో అని ప్రజల భయపడుతున్నారు. వీధికుక్కల దాడులు జిల్లాలోనే పెద్దశంకరంపేట మండలం మొదటి స్థానంలో ఉందని చెప్పడం ఆందోళన కలిగిస్తుంది. వీధి కుక్కలను నియంత్రించేందుకు అధికారులు

ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పలు గ్రామాల్లో, ప్రాంతాల్లో మనుషు లపై కుక్కలు దాడిచేసి గాయపరుస్తున్న నేపథ్యం.ఎప్పుడు ఏ కుక్క ఎక్కడి నుంచి వచ్చి కరుస్తుందో అన్న భయంతో పిల్లలు, వృద్ధులు రోడ్ల పైకి వచ్చేందుకే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై పిల్లలు తిరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

మూడు నెలలుగా పెద్దశంకరంపేట మండలంలో నమోదవుతున్న కుక్క కాటు విషయంలో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద శంకరంపేట మండలంలో 

ప్రతి నెల కుక్కకాటు బాధితుల సంఖ్య పెరు గుతూ వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదైన లెక్కల ప్రకారం గత సంవత్సరం నవంబర్లో 27 మంది, డిసెంబర్లో 31 మంది, జనవరిలో ఇప్పటి వరకు ఎనిమిది మంది కుక్క కాటు వల్ల చికిత్సలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వీధికుక్కల నియంత్రణకు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసు కోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment