పోలీసు సేవలను, పనితీరును పర్యవేక్షణకు క్యూ ఆర్ కోడ్

పోలీసు సేవలను, పనితీరును పర్యవేక్షణకు క్యూ ఆర్ కోడ్

 

పోలీసు పనితీరును ప్రజలు ఆన్లైన్ నందు తెలుపవచ్చు

 

 సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ

 

పోలీసు అందిస్తున్న సేవల పై ప్రజలు వారి అభిప్రాయం తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చినది అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం నందు క్యూఆర్ కోడ్ పోస్టర్ అను అదనపు ఎస్పీ నాగేశ్వర రావు, డి సి ఆర్ బి డీఎస్పీ మట్టయ్య లతో కలిసి అవిస్కరించారు. ఈ క్యూఆర్ ఇంటర్నెట్ మద్యమాల ద్వారా స్కాన్ చేసి వివరాలు నమోదు చేయవచ్చు అని తెలిపినారు. సిటిజన్ ఫీడ్బ్యాక్ ను తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ ను ప్రారంభించడం జరిగింది. గతంలో పోలీసుల సేవలపై పిర్యాదుదారుల కు ఫోన్ చేసి అభిప్రాయాలు సేకరించేవారు. ప్రస్తుతం ఈ క్యూఅర్ కోడ్ ము స్కాన్ చేసి పిటిషన్, ఎఫ్ఐఆర్, ఈ చలాన్, పాస్పోర్ట్ ధ్రువీకరణ మరియు ఇతర అంశాలపై, పోలీసు అధికారుల ప్రతిస్పందన, ప్రవర్తన వారి అభిప్రాయాలను నమోదు చేయవచ్చును. పోలీస్ స్టేషన్లో మరియు అధికారులు సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో రేటింగ్ చేయబడతారని తెలియజేశారు. ఈ విధానం పోలీసు సిబ్బందిలో బాధ్యత పారదర్శకతను పెంచుతుందని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ ప్రతి పోలీసు కార్యాలయం నందు ఈ క్యూఆర్ కోడ్ను ప్రజలకు అందుబాటులో ఉండేదా ప్రదర్శిస్తామన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లలో ప్రజలకు సులభంగా కనిపించే విధంగా రిసెప్షన్ సెంటర్, స్టేషన్ హౌస్ అధికారి రూమ్ నందు, ప్రజలు వేచి ఉండే గది నందు, బయటి ప్రవేశ ద్వారం వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపారు. 

 

ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డి సి ఆర్ బి డీఎస్పీ మట్టయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, ఐటీ కోడ్ ఆర్ ఎస్ ఐ రాజశేఖర్ సిబ్బంది ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment